ఆళ్లపల్లి: నిలిచిన పనులను పూర్తి చెయ్యాలి అని వినతి

ఆళ్లపల్లి మండల పరిధిలోని కర్నెగూడెం వెళ్లే గ్రామానికి బ్రిడ్జి, బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతూ ఆయా గ్రామస్థులు శుక్రవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకి క్యాంపు కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. జల్లేరు వాగుపై నిలిచిన బ్రిడ్జి పనులు, చద్రపురం వరకు బీటి రోడ్డు పనులు పూర్తి చేయాలని, దీంతో పాటు పంట భూములకు త్రీ ఫేస్ విద్యుత్ సౌకర్యం కల్పించాలని విన్నవించారు.

సంబంధిత పోస్ట్