అశ్వాపురం: పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకుల సంబరాలు

రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేయడాన్ని హర్షిస్తూ శుక్రవారం అశ్వాపురం మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బీసీ నాయకులు, పార్టీ శ్రేణులు బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం రిజర్వేషన్ అమలు చేసిందని, ఇది చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఓరుగంటి బిక్షమయ్య, కేశవరెడ్డి రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్