అశ్వాపురం మండలం, చింతిర్యాల కాలనీ గ్రామానికి చెందిన పాయం నాగరాజు అనే రైతు వడదెబ్బతో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఈనెల 10న ట్రాక్టర్తో దుక్కి దున్నుతుండగా అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయాడు. అతన్ని పీహెచ్సీ, మణుగూరు, భద్రాచలం, ఖమ్మం ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.