బుధవారం తెల్లవారుజామున అశ్వాపురం మండలం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏటూరు నాగారం నుంచి విజయవాడ వైపు వెళ్తున్న వాహనం డివైడర్‌ను ఢీకొనడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో వీర్రాజు అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందగా, గాయపడిన గర్భిణీ స్త్రీ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన బుధవారం అశ్వాపురం మండలంలో చోటుచేసుకుంది.