అశ్వాపురం: అన్ని రంగాల్లో నియోజకవర్గ అభివృద్ధికి కృషి

అశ్వాపురం మండలంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం పర్యటించారు. మండల పరిధిలోని కళ్యాణపురం, మిట్టగూడెం, బట్టీలగుంపు, అమ్మగారిపల్లి, జగ్గారం, అమెర్ధ పంచాయతీలలో సుమారు కోటి రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన CC రోడ్లు, పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్దే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్