అశ్వాపురం: గురుకులంలో జాతీయ సైన్స్ దినోత్సవం వేడుకలు

అశ్వాపురం మండలం మిట్టగూడెంలోని తెలంగాణ గిరిజన గురుకుల డిగ్రీ బాలుర కళాశాలలో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన శాస్త్రీయ ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. విద్యార్థుల్లో విజ్ఞానంపై ఆసక్తిని పెంపొందించేందుకే ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని ప్రిన్సిపల్ బి. రవి తెలిపారు. విద్యార్థులు తయారుచేసిన వివిధ రకాల సైన్స్ ఫెయిర్ పరికరాలు ప్రదర్శనకు పెట్టారు.

సంబంధిత పోస్ట్