అశ్వాపురం తహసీల్దార్ కార్యాలయంలో సామాజిక న్యాయ దినోత్సవ కార్యక్రమం

అశ్వాపురం తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం ట్రైనీ కలెక్టర్ సౌరభ్ శర్మ ఆధ్వర్యంలో సామాజిక న్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ, అంబేద్కర్, పూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగం కల్పించిన సమాన హక్కులు, అవకాశాల సందేశం ప్రతి పౌరుడికి చేరాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం ద్వారా సామాజిక న్యాయంపై అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్