వెంకటాపురం గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థిని సోయం హరిణి దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక సెంట్రల్ యూనివర్సిటీల్లో ఒకటైన డిల్లీలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ ఆర్కియాలజీలో సీటు సాధించింది. ఆమె తండ్రి శ్రీను వ్యవసాయదారుడు 10, ఇంటర్ భద్రాచలంలోని గిరిజన గురుకుల్లో చదివింది, మేడ్చల్లోని గురుకుల కళాశాలలో డిగ్రీ చేసింది. శనివారం కాంగ్రెస్ నాయకులు ఆమెను సన్మానించారు.