అశ్వాపురం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

అశ్వాపురం మండలంలోని మొండికుంట సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

సంబంధిత పోస్ట్