భద్రాచలం: గోవులు తరలిస్తున్న వాహనం పట్టివేత

చర్ల నుండి బూర్గంపహాడ్ మండలంలోని బంజర సంతకు తరలిస్తున్న గోవులను విశ్వాహిందూ పరిషత్, భజరంగ్ దళ్ కార్యకర్తలు గురువారం అడ్డుకున్నారు. బొల్లెరో వాహనంలో గోవులను తరలిస్తుండగా, భద్రాచలం బ్రిడ్జ్ వద్ద వాహనాన్ని అడ్డుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా ఈ గోవులను సంతకు తరలిస్తున్నారా? లేక కబేలాకు తరలిస్తున్నారా అనే విషయాన్ని విచారణ చేసి గోవులను గోశాలకు పంపనున్నారు.

సంబంధిత పోస్ట్