భద్రాద్రి: ప్రయాణికురాలి దాడిలో ఆర్టీసీ కండక్టర్ మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక అశ్వాపురంలో విషాదం చోటుచేసుకుంది. గత నెల 25న మణుగూరు నుండి భద్రాచలం వెళ్తున్న బస్సులో చిల్లర విషయంలో ప్రయాణికురాలు తోసివేయడంతో తీవ్రంగా గాయపడిన ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక (24) మంగళవారం అర్ధరాత్రి హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మరణించారు. ఆరు నెలల క్రితమే కారుణ్య నియామకంలో ఉద్యోగం పొందిన ఆమె మృతితో కుటుంబం శోకసంద్రంలో మునిగింది. ఈ ఘటనకు నిరసనగా బుధవారం ఖమ్మం రీజియన్‌లో బంద్‌కు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది.

సంబంధిత పోస్ట్

✕
✕