గుండాలలో భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమం

గుండాల మండలంలోని జగ్గు తండాలో ప్రగతిశీల యువజన సంఘం (పివైఎల్) ఆధ్వర్యంలో భగత్ సింగ్, రాజగురు, సుఖ్దేవ్ ల 95వ వర్ధంతి వారోత్సవాలు నిర్వహించారు. గ్రామ నాయకుడు బన్సీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విప్లవ వీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశం కోసం వారి త్యాగాలను స్మరించుకుంటూ యువత వారి బాటలో నడవాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్