నటుడు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ నేత నరేష్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాకలో, కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన 'SIR' ప్రక్రియపై నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలను కరకగూడెం మండల బీజేపీ అధ్యక్షుడు జుజ్జూరి నరేష్ శుక్రవారం  తీవ్రంగా ఖండించారు. అర్హులందరికీ ఓటు హక్కు కల్పిస్తూ నకిలీ ఓట్లు, చొరబాటుదారులను తొలగించడానికే ఈ ప్రక్రియ తోడ్పడుతుందని ఆయన స్పష్టం చేశారు. పారదర్శక ఎన్నికల వ్యవస్థపై విమర్శలు బాధ్యతారాహిత్యమని, సీఈసీని తొలగించాలనడం ప్రతిపక్షాల కుట్ర అని మండిపడ్డారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు SIR ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕