రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుపై కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. శనివారం బూర్గంపాడు మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చిత్రపటాలకు పాలభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు.