బూర్గంపాడు: ఐటీసీ, రోటరీ ఆధ్వర్యంలో గర్భిణీలకు పౌష్టికాహార కిట్లు అందజేత

బూర్గంపాడు (మండలం) ఐటీసీ రోటరీ ఆధ్వర్యంలో గురువారం గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహార కిట్లను మొరంపల్లి బంజర పీహెచ్‌సీ, బూర్గంపాడు సీహెచ్‌సీ నందు సుమారు 30 కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు మంచి పౌష్టికాహారాన్ని అందించాలని పుట్టే పిల్లలకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండకూడదని వారికి పది రకాల పౌష్టికాహారాన్ని అందజేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీసీ మేనేజర్స్ చెంగల్ రావు, చాంద్ పాషా, డీపీ రాయ్, డాక్టర్స్ శ్రావణి, తిరుపతి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్