బూర్గంపాడు: ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి

బూర్గంపాడు మండలంలోని మోరంపల్లి బంజర పీహెచ్‌సీని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ రవీందర్‌ నాయక్‌ శనివారం సందర్శించారు. కేంద్రంలోని పలు విభాగాలను పరిశీలించారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. మందుల సరఫరా, పరికరాల వినియోగం వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. వాతావరణ మార్పులతో వ్యాధులు వ్యాప్తి చెందుతున్నందున సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్