బూర్గంపాడు మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులకు టీడీపీ కూడా మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం జరిగిన పత్రికా సమావేశంలో టీడీపీ మండల కమిటీ పిలుపునిచ్చింది. మండల వ్యాప్తంగా కాంగ్రెస్, టీడీపీ కలిసి మద్దతు ప్రకటించిన అభ్యర్థులను గెలిపించాలని ఇరు పార్టీల నాయకులు ప్రజలను కోరారు.