భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం సారపాకలో రెండేళ్ల క్రితం కొనుగోలు చేసిన నాలుగు సెంట్ల స్థలానికి దారి విషయంలో ఇద్దరు మహిళల మధ్య శుక్రవారం వివాదం తలెత్తింది. స్థలానికి దారి ఉందని చెప్పి విక్రయించారని ఒకరు ఆరోపిస్తుండగా, ప్రస్తుతం దారి లేదని మరో మహిళ గోడ నిర్మించడంతో ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో ఇరువర్గాల మహిళలు జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు. ఓ వ్యక్తి ఇటుకతో కొట్టేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.