రోడ్డు నిర్మాణం కోసం సంతకాల సేకరణ: బాలాజీ పిలుపు

పినపాక నియోజకవర్గం, బూర్గంపాడు మండలం సారపాక గ్రామపంచాయతీ పరిధిలో రామభద్ర ఐటీఐ నుంచి గాంధీనగర్ కాలనీ వరకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతూ చుక్కపల్లి బాలాజీ ఆధ్వర్యంలో బుధవారం సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించనున్నారు. రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధి లక్ష్యంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మద్దతు తెలపాలని ఆయన కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయనున్నట్లు తెలిపారు. .

సంబంధిత పోస్ట్