మణుగూరులో పల్స్ పోలియో చుక్కల పంపిణీ ప్రారంభం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం ముత్యలమ్మ నగర్ గ్రామంలో ఆదివారం 5 సంవత్సరాల పిల్లలకు పల్స్ పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం సర్పంచ్ చేతుల మీదుగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా మొదటి వార్డ్ సభ్యులు గుంటక వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, గ్రామంలోని ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని, తల్లిదండ్రులు ఈ బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.

సంబంధిత పోస్ట్