భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాకలోని బూర్గంపాడు మండల కేంద్రంలో బుధవారం PASS ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. సంస్థ అధ్యక్షుడు డా. ఎస్. మురళీకృష్ణ ప్రారంభించిన ఈ శిబిరంలో సుమారు 150 మందికి వైద్య పరీక్షలు, చికిత్స, మందులు, వైద్య సలహాలు అందించారు. అవసరమైన వారికి వైద్యులు పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సమస్యలపై సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో SI మేడ ప్రసాద్, సారపాక సర్పంచ్ గుగులోత్ కిషోర్ శివరాం నాయక్, బూర్గంపాడు సర్పంచ్ మందా నాగరాజు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.