భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాకలో పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతీ, యువకులకు బూర్గంపాడు పోలీస్‌స్టేషన్‌లో ఉచిత శిక్షణతో పాటు వసతి సౌకర్యం కల్పిస్తున్నట్లు ఎస్‌హెచ్‌ఓ మేడా ప్రసాద్ తెలిపారు. జిల్లా ఎస్పీ రోహిత్‌రాజ్ ఆదేశాల మేరకు ఈ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 3వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు బూర్గంపాడు పోలీస్‌స్టేషన్‌లో దరఖాస్తు చేసుకోవాలని బుధవారం సూచించారు. ఈ శిక్షణ మరియు వసతి సౌకర్యం పోలీసు కొలువులకు సిద్ధమవుతున్న వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.