గుండాల మండలంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బుధవారం పర్యటించారు. కాచనపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి, గుండాల రైతు వేదికలో అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. కల్యాణలక్ష్మి, షాదీముభారక్ చెక్కులు కూడా అందజేశారు. ఇందిరమ్మ రెండో విడత ఇళ్ల కేటాయింపులో అందరికీ అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు.