గుండాల: యూరియా కోసం రైతుల తిప్పలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల ఏజెన్సీలో యూరియా కోసం రైతులు తిప్పలు పడుతున్నారు. యూరియా గోదాముల దగ్గర రైతులు భారీ క్యూ కట్టారు. వారం రోజులుగా అన్నదాతలు పడి కాపులు కాస్తున్నారు. యూరియా కొరత లేదని అధికారులు చెప్తున్నా గోదాముల దగ్గర రోజు రోజుకు రైతుల క్యూ లైన్లు పెరుగుతున్నాయి. గుండాల వ్యవసాయ సహకార సంఘం గోదాం దగ్గరకు పెద్ద ఎత్తున మహిళా రైతులు తరలివచ్చారు. సకాలంలో యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్