గుండాల: యువత ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: ఎస్ఐ

యువత క్రీడలలో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని గుండాల ఎస్ఐ ఎం రాజమౌళి కోరారు. గుండాల మండలంలోని దామరతోగు గ్రామంలోని యువతకు సోమవారం వాలీబాల్ కిట్ అందించారు. యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా మంచి అలవాట్లను అలవర్చుకొని గొప్పగా జీవించాలని సూచించారు. విద్యతోపాటు క్రీడలలో సైతం రాణించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్