కరకగూడెం: పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన డీఎస్పీ

కరకగూడెం పోలీస్ స్టేషన్ను డీఎస్పీ రవీందర్ రెడ్డి బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో పలు రికార్డులను ఆయన తనిఖీ చేశారు. స్టేషన్కు వస్తున్న ప్రజలకు పోలీసులు జవాబు దారితనంగా ఉండాలన్నారు. మండలంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ రాజేందర్, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్