కరకగూడెం: ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి

భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) కరకగూడెం మండల కమిటీ, ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ మరియు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోరుతూ సోమవారం ఎమ్ఈఓకు వినతి పత్రం అందజేసింది. ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి మాదాసు అఖిల్ మాట్లాడుతూ, మండలంలో ప్రైవేట్ విద్యాసంస్థలు విచ్చలవిడిగా పెరిగి, అడ్డు అదుపు లేకుండా ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతున్నాయని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్