బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మాతృమూర్తి ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గురువారం వారి స్వగ్రామం కరకగూడెంలో రేగా కుటుంబాన్ని పరామర్శించారు. లక్ష్మీ నర్సమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.