జనవరి 18న వరంగల్‌లో నేతకాని ప్రజల భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని నేతకాని స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గం ప్రేమ్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం కరకగూడెంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వరంగల్‌లోని కేడీసీ గ్రౌండ్స్‌లో వేలాది మందితో ఈ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.