కరకగూడెం: పిడిఎస్ బియ్యం పట్టివేత

కరకగూడెం మండలంలో గురువారం 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అక్రమంగా పౌల్ట్రీ ఫారానికి తరలిస్తుండగా సివిల్ సప్లై అధికారి శివకుమార్, ఎస్సై నాగేశ్వరరావు పట్టుకున్నారు. చిరుమల గ్రామంలో జరుగుతున్న ఈ రవాణాపై అందిన సమాచారం మేరకు అధికారులు అక్కడికి చేరుకొని ట్రాక్టర్లలో ఉన్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్