కేసీఆర్ రాజీనామా చేయాలి: కాంగ్రెస్ నాయకుల డిమాండ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాకలో కరకగూడెం మండల కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, సీఎం రేవంత్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పిలుపు మేరకు బుధవారం కాంగ్రెస్ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ప్రజా సమస్యలను విస్మరిస్తున్నారని, వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రూ. 22. 24 కోట్ల ప్రజాధనం ఖర్చవుతున్నా కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. దళితులకు మూడెకరాల భూమి, ఉద్యోగాలు, రుణమాఫీ వంటి హామీలను విస్మరించిన ఆయనకు ప్రజా ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు లేదని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్