ఆళ్లపల్లి మండలం రాఘవపురం పంచాయతీ చంద్రపురం ప్రాంతానికి చెందిన కొర్సా కమలహాసన్(30) గత రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందుస్తున్న క్రమంలో పరిస్థితి విషమించడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు.