జ్వరంతో వ్యక్తి మృతి

గుండాల మండలం ఘణపురం గ్రామానికి చెందిన కత్తి బుచ్చయ్య(36) జ్వరంతో శుక్రవారం మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం. గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఖమ్మం ప్రైవేటు వైద్యశాలకు తరలించి వైద్య సేవలు అందించారు. కొంత మేరకు కోలుకోవడంతో ఇంటికి తీసుకు వచ్చారు. మళ్లీ పరిస్థితి విషమించి మృతి చెందారు.

సంబంధిత పోస్ట్