మణుగూరు: నిజాయితీ చాటుకున్న ఆటోడ్రైవర్

మణుగూరుకు చెందిన ఆటో డ్రైవర్ కె. శ్రీనివాస్ తన నిజాయితీని చాటుకున్నారు. తన ఆటోలో ప్రయాణించి, హనుమాన్ ఆలయం వద్ద దిగిపోయిన ప్రయాణికులు మర్చిపోయిన బ్యాగును ఆయన గుర్తించారు. వెంటనే ఆ బ్యాగును మణుగూరు పోలీస్ స్టేషన్లో అప్పగించారు. అనంతరం, బాధితులైన కల్తీ సమ్మక్క- విజయ్కుమార్లకు ఆటో డ్రైవర్ శ్రీనివాస్ చేతుల మీదుగా ఆ బ్యాగును అందజేశారు.

సంబంధిత పోస్ట్