మణుగూరు: తీన్మార్ మల్లన్నపై దాడిని ఖండించిన బీసీ సంఘం

మణుగూరు మండల కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం ముఖ్య నాయకులు మంగళవారం సమావేశమయ్యారు. జిల్లా ఇంఛార్జ్ సోమేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ.. హైదరాబాదులో బీసీ బిడ్డ తీన్మార్ మల్లన్నపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. మూడు శాతం లేని వెలుమ దొరలను మీకు మాకు కంచం పొత్తు ఉందా ఇయ్యం పొత్తు ఉందా అని అడగడం తప్పేంటని ప్రశ్నించారు. మల్లనపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్