మణుగూరు: దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: డీఎస్పీ

మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి శనివారం ప్రజలకు సూచనలు జారీ చేశారు. సంక్రాంతి పండుగ సెలవుల్లో ఊళ్లకు వెళ్లేవారు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఖాళీగా ఉన్న ఇళ్లను దొంగలు లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. విలువైన వస్తువులు, నగదును ఇంట్లో ఉంచవద్దని, సీసీ కెమెరాలు, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్