రైతుల సమస్యలు పరిష్కరించేందుకే భూ భారతి చట్టాన్ని ప్రభుత్వం రూపొందించిందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. భూ భారతి చట్టం ప్రారంభించిన నేపథ్యంలో మణుగూరు మండలం గుట్టమల్లారం రైతు వేదికలో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.