మణుగూరు: దుప్పట్లు పంపిణీ

మణుగూరు మండలంలోని రేగులగండిలో శుక్రవారం భరోసా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో కూనవరం సర్పంచ్ ఏనిక శ్వేత, పీకేఓసీ రక్షణా అధికారి లింగబాబుతో కలిసి స్థానికులకు దుప్పట్లు పంపిణీ చేశారు. అమీనుద్దీన్ నేతృత్వంలో దాతల ప్రోత్సాహంతో భరోసా సేవలు ఆదివాసీ గ్రామాలకు అందించడం అభినందనీయమని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్