మణుగూరు: ప్రతీఒక్కరు చెట్లు నాటడంపై దృష్టి పెట్టాలి

మణుగూరు మండలం సాంబాయిగూడెం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు శుక్రవారం వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని మొక్కలు నాటారు. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం 20 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. అడవులను సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు అవకాశం ఉంటుందని, ప్రతీ ఒక్కరు చెట్లు నరకడం మానేసి మొక్కలు నాటడంపై దృష్టి పెట్టాలని సూచించారు.

సంబంధిత పోస్ట్