మణుగూరు: 50 వేలు దాటితే సరైన పత్రాలు చూపాలి

ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున, ప్రజలు రూ. 50 వేలకు మించి నగదుతో ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా సరైన పత్రాలు వెంట తీసుకెళ్లాలని మణుగూరు తాహశీల్దార్ అద్దంకి నరేష్ మంగళవారం సూచించారు. కోడ్ అమలు గురించి చాలా మందికి తెలియదని, సాధారణంగా ప్రయాణిస్తే అధికారులు నగదును సీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన హెచ్చరించారు. ఈ నిబంధనలను పాటించడంలో అజాగ్రత్త వహించవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్