మణుగూరు ఐకేపీ కార్యాలయం ఎదుట ఐకేపీ, వీవోఏలు సంయుక్తంగా రిలే దీక్షలు చేపట్టారు. సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు సరెడ్డి పుల్లారెడ్డి దీక్షా శిబిరాన్ని సందర్శించి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి కనీస వేతనం రూ. 20 వేలు ఇస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఇన్సూరెన్స్ సౌకర్యం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.