గురువారం తెల్లవారుజామున మణుగూరులోని పట్టణంలో సాయిబాబా ఆలయం ఎదుట గ్యాస్ సిలిండర్ల లోడుతో వెళ్తున్న లారీ పాలటికొట్టింది. లారీ రోడ్డుకు అడ్డంగా పడడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, క్రేన్ సహాయంతో లారీని పక్కకు తొలగించారు. పెను ప్రమాదం తప్పడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.