మణుగూరు మండల పరిధిలోని సమితి సింగారం, గుట్ట మల్లారం పంచాయతీలో రూ. కోటి అంచనా వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆదివారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో MPDO శ్రీనివాసరావు, ప్రభుత్వ అధికారులు, మండల అధ్యక్షులు పిరినాకి నవీన్, టౌన్ అధ్యక్షులు శివ సైదులు, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తరుణ్ రెడ్డి, మండలం ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.