మణుగూరు మండలంలోని సమితిసింగారం, గుట్టమల్లారం, సాంబాయిగూడెం గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు సోమవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును కలిసి తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రాలు అందజేశారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.