కేసీఆర్ కు సిట్ నోటీసులను నిరసిస్తూ ఆదివారం మణుగూరు అంబేడ్కర్ సెంటర్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేస్తున్న సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సీఐ నాగ బాబు బీఆర్ఎస్ కార్యకర్తలను సముదాయించే ప్రయత్నం చేశారు. ఆందోళనకారులు రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలపడంతో పట్టణంలో భారీగా పోలీసులు మోహరించారు.