మణుగూరు మండలంలోని రామానుజవరం గ్రామంలో గుడుంబా విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ గిరిజన సమాఖ్య జిల్లా ఉపాధ్యక్షుడు సతీష్ డిమాండ్ చేశారు. గుడుంబాను తయారు చేసే, విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎక్సైజ్ అధికారులకు గురువారం ఫిర్యాదు చేశారు. గుడుంబా అమ్ముతూ ప్రజల ప్రాణాలపై చెలగాటమాడుతున్నారని పేర్కొన్నారు.