భద్రాచలం ఎంవీఐ వెంకటపుల్లయ్య బుధవారం మణుగూరులో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, బస్ డ్రైవర్లు, క్లీనర్లకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు రోడ్డు భద్రతా ప్రమాణాలను తప్పక పాటించాలని, విద్యార్థుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తమ బస్సులను పూర్తి కండీషన్ లో ఉండేలా చూసుకోవాలని సూచించారు.