ఈనెల 20న జరగాల్సిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జులై 9కి వాయిదా వేశామని అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకుడు ఆర్. మధుసూదన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం మణుగూరు సీపీఐ కార్యాలయంలో జరిగిన అఖిలపక్ష కార్మిక సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇండియా, పాకిస్థాన్ మధ్య ఘర్షణ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు సార్వత్రిక సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేశామని చెప్పారు.