ఈ నెల 21, 22న నిజామాబాద్ లో జరిగే టీయూసీఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షుడు ఆర్. మధుసూదన్ రెడ్డి కోరారు. మణుగూరు సింగరేణిలో వివిధ విభాగాలలో కార్మికులతో కలిసి పోస్టర్లు ఆవిష్కరించారు. కరపత్రాలు పంచుతూ విస్తృత ప్రచారం నిర్వహించారు. అన్ని రంగాలలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సంఘం పోరాడుతూ వారి హక్కుల కోసం ఉద్యమిస్తుందన్నారు. అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.