మణుగూరు: ఇద్దరు మైనర్ బాలికలు పరార్

శుక్రవారం ఉదయం మణుగూరు బాలల సదనం నుండి ఇద్దరు మైనర్ బాలికలు గోడ దూకి పారిపోయారు. వారం రోజుల క్రితం భద్రాచలంలో బాల్య వివాహం చేసుకునే ప్రయత్నంలో వీరిని అధికారులు సదనానికి అప్పగించారు. ఈ ఇద్దరు బాలికలు భద్రాచలం ప్రాంతానికి చెందినవారని గుర్తించారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సంరక్షణ అధికారి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్